క్రీడాభివ్రుద్ధి ప్రభుత్వం సిద్ధంగా వుంది...
Ens Balu
3
Rushikonda
2020-08-28 20:34:39
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామ్ గోపాల్ అన్నారు. శుక్రవా రం జిల్లా క్రీడల శాఖ అధికారులతో కలిసి సాప్ వాటర్ స్పోర్ట్ష్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందింస్తుందని చెప్పారు. అదే విధంగా గిరిజన ప్రాం తాల్లో కూడా క్రీడలను మరింత అభివ్రుద్ధి చేయనున్నదని చెప్పారు. ప్రస్తుతం క్రీడాభివ్రుద్ధికి కేటాయిచిన పనులను సత్వరమే పూర్తిచేసి వాటి నివేదికలు పం పాలన్నారు. వీటితో పాటు, ఏఏ క్రీడల ద్వారా యువతను మరింతగా రాణించేలా చేయవచ్చుగో గుర్తించాలని జిల్లా క్రీడల అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారులతోపాటు, ఐటిడిఏ క్రీడల అధికారులు పాల్గొన్నొరు...