వైద్యులు దేవుళ్లతో సమానం..


Ens Balu
2
Visakhapatnam
2021-05-26 14:03:03

వైద్యులు దేవుళ్లతో సమానమని, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  అవంతి ఫంక్షన్ హాల్లో కోవిడ్ పై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వైద్యులకు చేతులెత్తి నమస్కారం చేయాలన్నారు.  ప్రభుత్వ అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య భద్రత పై సర్వే చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఏర్పాటు చేసిన క్వారయింటైన్ సెంటర్లు గూర్చి ప్రజలకు తెలియచేయాలని, నోడల్ ఆఫీసర్ల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.   ముఖ్యంగా సెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో భీమిలి నియోజక వర్గంలో ప్రతి ఒక్కరికి వ్యాక్షిన్ అందే విధంగా చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.  కర్ఫ్యూ విధించాకే కోవిడ్ మరణాలు తగ్గాయని, ప్రజలందరూ తమ బాధ్యతగా మాస్కులు తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ అదుపులోకి వచ్చే వరకు వేచి ఉండాలని తెలిపారు. వ్యాక్షినేషన్ అందరూ చేయించుకోవాలని, వ్యాక్షిన్ చేసుకున్నవారు ఎవ్వరు ఇప్పటి వరకు మరణించలేదని తెలిపారు.  వ్యాక్షిన్ రెండు దశలను పూర్తి చేసుకున్నామని ఉదాసీనంగా వుండొద్దన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన వారికి నివాళులర్పించి, మౌనాన్ని పాటించారు.
 5,6,7,8 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పి.హెచ్.సి వైద్య సిబ్బంది, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ వార్డు హెల్త్ సెక్రటరీలు, శానిటరీ హెల్త్ సెక్రటరీలతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించి కోవిడ్ నియంత్రణ కొరకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్త ముత్తంశెట్టి మహేష్, రూరల్ తాహసిల్దార్ ఆర్. నరసింహమూర్తి, జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాము, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కిషోర్, మధురవాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారినులు డాక్టర్. అశ్విని శైలజ, డాక్టర్ దీపిక, యు.పి.హెచ్.సి. డాక్టర్లు సునీల్, శ్రీదేవి, శృతి, వాణిపరమేశ్వరి, ఏ.పి.డి.దుర్గాప్రసాద్, సి.ఓ లు ఎస్.ఉమ, టి.విజయలక్ష్మి, ఆర్. అప్పలకొండ, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, శానిటేషన్, వెల్ఫేర్ సెక్రటరీలు  నాయకులు గాదె రోసిరెడ్డి, ఈ.ఎన్.ఎస్.చంద్రరావు, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, సంజీవ్ యాదవ్, పిళ్ళా రమణ బాబు, పోతిన ఎల్లాజి, వంకాయల మారుతీ ప్రసాద్, పోతిన సురేష్, పోతినప్రసాద్, జె.ఎస్.రెడ్డి, ముచ్చి రామారావు, తదితరులు పాల్గొన్నారు.