ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు , వారి కుటుంభ సభ్యులు వెంటనే వాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు 45 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ వాక్షినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. బుధవారం సంయుక్త కలెక్టర్ (హెల్త్) డా. మహేష్ కుమార్ తో కలసి జిల్లా అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులు, , వారి కుటుంభ సభ్యులు వెంటనే టీకా వేయించుకోవాలన్నారు. మంగళవారం 3 ప్రాంతాల్లో టీకా వేసినప్పటికి 700 మంది ఉద్యోగులు మాత్రమే వేయించుకున్నారని, మిగిలిన వారంతా వెంటనే వేయించుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు అందుకు సహకరించాలని , వందకు పైగా ఉద్యోగులున్న సంస్థ ల వద్దనే టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరుగుతుందని అన్నారు. అన్ని మున్సిపాలిటీలలోనూ, మండలాల్లోనూ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలు తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, వారి కోసం తాగు నీటిని, షెల్టర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంత మంది వస్తారో ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా టీకా వైల్స, కేంద్రాలను అందుబాటు లో ఉంచాలన్నారు. క్యూ లైన్ల నిర్వహణకు, భౌతిక దూరాన్ని పాటించేలా చూడడానికి మహిళా పోలీసు సహకారాన్ని తీసుకోవాలన్నారు. టీకా ను వృధా చెయ్య వద్దని సూచించారు.
సంయుక్త కలెక్టర్ డా.మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిషీల్డ్ మొదటి డోస్, మొదటి డోస్ వేసుకొని 84 రోజులు పూర్తి అయిన వారికి రెండవ డోస్ కోవిషీల్డ్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కొ వాక్సిన్ మొదటి డోస్ ప్రస్తుతం అందుబాటు లో లేదని, అయితే రెండవ డోస్ అవసరమైన వారికి మొదటి డోస్ తీసుకున్న నెల రోజుల పూర్తి అయిన వారికి వేయడం జరుతుందని అన్నారు. కోవిడ్ పొజిటివ్ వచ్చిన వారు మూడు నెలల వరకు వాక్సిన్ తీసుకోకూడదని అన్నారు. బాలింతలు కూడా వాక్సిన్ తీసుకోవచ్చని, గర్భిణీ లు తీసుకోకూడదని తెలిపారు. జిల్లాకు సరిపడా స్టాక్ కోవిషీల్డ్ టీకా అందుబాటు లో ఉందని, ఒకే సారి అందరూ వెళ్లకుండా, అందదేమోనని ఆందోళన చెందకుండ 45 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరారు.