ఏపీలో అంతర్జాతీయస్థాయి క్రీడా సదుపాయాలు...


Ens Balu
2
Srikakulam
2020-08-29 16:38:24

ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు  ధ ర్మాన క్రిష్ణదాస్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవంను స్థానిక స్విమ్మింగ్ పూల్ వద్ద జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్య క్రమా న్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఒక సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు చదివి వినిపించారు.  క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసి, హాకీ మాంత్రికుడిగా కీర్తి గడించిన ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ అని ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతీఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు.  కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూనే సంబరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫిట్ ఇండియా పేరుతో గత ఏడాది ఘనంగా నిర్వహిం చుకు న్నామని చెప్పారు.దేశంలో అత్యున్నత స్థాయికి చేరిన క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఖేల్ రత్న, ద్రోణాచార్య, అర్జున అవార్డులను అందించి సత్కరించడం జరుగుతోందని అన్నారు.