చిరు వ్యాపారాలు చేసే వారికి ఆర్ధిక సహకారాన్ని అందించే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు పధకం క్రింద అందిన దరఖాస్తులను వేగంగా గ్రౌండింగ్ చేయాలని సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ కుమార్ బ్యాంక్ అధికారులను కోరారు. గురువారం ఆయన చాంబర్ లో మెప్మా, డి.ఆర్,డి.ఏ అధికారులు, బాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోడు పధకం క్రింద ఇచ్చిన లక్ష్యాలను త్వరగా చేరుకోవడం లో బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు. రీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్ధుల దరఖాస్తులను బాంకర్ల లాగిన్ లో కి పంపడం జరిగిందని, ఆ దరఖాస్తులన్నిటిని వెంటనే గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 12 వేల 173 దరఖాస్తులు అందగా వాటి లో 2641 మంది ఆసక్తిని చూపించారని, అందులో 947 దరఖాస్తులను రీ వెరిఫికేషన్ చేసి బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా ద్వారా 3వేల 973 దరఖాస్తులు అందగా వెరిఫికేషన్ అనంతరం 459 దరఖాస్తులను బాంక్ లకు పంపడం జరిగిందన్నారు. మొత్తం 1406 దరఖాస్తుదారులకు ప్రస్తుతం గ్రౌండింగ్ చేయవలసి ఉందని, వీరికి వెంటనే బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేయాలని జె.సి సూచించారు. ఆసక్తి చూపిన మరో 1797 మందికి స్త్రీ నిధి క్రింద రుణాలను అందించాలని అన్నారు.
జగనన్న తోడు పధకం గురించి అవగాహన కల్పించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల సహకారం తో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ల ద్వారా లబ్ధి దారుల గుర్తింపు చేయాలని తెలిపారు. ఈ పధకం పై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం వలన చిరు వ్యాపారులను ఎక్కువ మందిని కవర్ చేయవచ్చని అన్నారు. వాలంటీర్ లకు, వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ లకు అవ్గహన కోసం వెంటనే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశం లో లీడ్ జిల్లా మేనేజర్ స్రినివస రావు, మెప్మా పి.డి సుగుణకార రావు డి.ఆర్.డి.ఏ అదనపు పి.డి సావిత్రి, పలు బ్యాంక్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.