అప్పన్న ఆలయ అభివృద్ధికి క్రుషి చేయండి..


Ens Balu
2
Visakhapatnam
2021-05-27 10:12:36

విశాఖలోని  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలే అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు గురువారం విజయ్ సాయిరెడ్డి ని శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం విజయ్ సాయిరెడ్డి కి సింహాచలం అప్పన్న స్వామి శేష వస్త్రం..చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ సాయిరెడ్డి శ్రీనుబాబును అభినందిస్తూ.. సింహాచలం పుణ్యక్షేత్రాన్ని మరింత పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని విజయ్ సాయిరెడ్డి పేర్కొన్నారు. స్వామి సేవ చేసుకునే  అవకాశం కల్పించిన విజయసాయిరెడ్డికి శ్రీనుబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

సిఫార్సు