ట్రాన్స్ జెండర్స్ కు ఆర్థిక సహాయం అందజేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు కె.జీవనబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు కరోనా కష్ట సమయంలో రూ.1500 ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. ఆర్ధిక సహాయం పొంఫుటకు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. దరఖాస్తును http://www.nisd.gov.in వెబ్ సైట్ లో సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంకు పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ తదితర వివరాలను సమర్పించాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ అందరు సద్వినియోపరచు కోవాలని ఆయన కోరారు.