రేపు డిసిసి సమావేశం-కలెక్టర్..
Ens Balu
3
Ongole
2021-05-27 10:40:40
ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశం 28వ తేదీన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్పందన సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ, కట్టడి చర్యలు, ఆయా కార్యకలాపాలపై సమీక్ష జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఇంన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి. విశ్వరూప్, రాష్ట్ర విద్యుత్, అటవి శాస్త్ర సాంకేతిక పర్యావరణశాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాలోని శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొంటున్నారని కలెక్టర్ చెప్పారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరుకావాలని ఆయన తెలిపారు.