వాలంటీర్లకు విసిసిఐ యూత్ వింగ్ మాస్క్ ల వితరణ
Ens Balu
3
Visakhapatnam
2020-08-29 16:54:11
విశాఖజిల్లాలో కరోనా వైరస్ ను నియంత్రించడంలో వార్డు వాలంటీర్లు చేస్తున్న క్రుషి అభినందీయమని యూత్ వింగ్, విసిసిఐ వైజాగ్ సివి అనిరుధ్ రావు అన్నారు. శనివారం ఈ మేరకు కార్యాలయంలో 1000 మాస్కులను వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఒక భాద్యతాయుతమైన విధి నిర్వహణ చేస్తూ, ప్రజలకు వాలంటీర్లు మంచి సేవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో వాలంటీర్లు వైరస్ బారిన పడకుండా మాస్కులు దోహదపడాలనే ఉద్యేశ్యంతో వీటటిని అందజేస్తున్నామని చెప్పారు. వైజాగ్ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (విసిసిఐ) 1931 లో స్థాపించిన దగ్గర నుంచి సేవా కార్యక్రమా లు చేపడుతున్నామన్నారు. యూత్ వింగ్, నగరంలోని యువ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను ప్రోత్సహించే వృత్తిపరమైన సంస్థ కావడంతో పాటు ఆపద సమ యంలో సహాయం అందించేలా కూడా పనిచేస్తుందన్నారు. సంస్థ సిబ్బంది శ్రీకాంత్ తోపాటు, వాలంటీర్ సతీష్ పాల్గొన్నారు.