పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య నిర్వహణ..


Ens Balu
4
Visakhapatnam
2021-05-27 17:19:54

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పిన్ పాయింట్ విధానంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఐదవ జోన్ 44వ వార్డు పరిధిలోని  రామచంద్ర నగర్ తదితర ప్రాంతాలలో  కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని ఉండేలా చూడాలని ఎఎంఓహెచ్ ను ఆదేశించారు. ఎవరికి నిర్దేశించిన పాయింట్ లో వారే విధులు నిర్వహించాలని, ఒక్కొక్క పిన్ పాయింట్ లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని వారిని సర్దుబాటు చేయాలని వారే డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని తెలిపారు.  తడి-పొడి చెత్త వేరువేరుగా తీసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరువేరుగా ఇచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలని ఆవిధంగా ఎవరైనా చెత్త వేసినచో ఆ చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ళకు మరియు దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని, ప్రతి దుకాణం ముందు డస్ట్    బిన్లు ఉండేలా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రజల కోరిక మేరకు ఎవరైనను యుజిడి కనెక్షన్ తీసుకుని లేనియెడల వారికి కొత్తగా కనెక్షన్ ఇవ్వాలని పర్యవేక్షక ఇంజనీర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అయిదవ జోనల్ కమిషనర్ సింహాచలం,  పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాలరావు, ఎఎంఓహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజనీర్ (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.      
సిఫార్సు