ప్రారంభమైన మొటి డోసు కోవిడ్ టీకా..


Ens Balu
3
GVMC Park
2021-05-27 17:22:16

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేస్తున్నట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, ఆరిలోవ, మల్కాపురం FRU సెంటర్ల లోను, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేస్తున్నట్టు తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేయించుకుని 84 రోజులు పూర్తయిన వారికి రెండవ డోస్ వేయడం జరుగుతుందని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా, ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని 45సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించి, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్ తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద రద్దీ దృష్ట్యా పోలీసుల సహాయం తీసుకోవాలని, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి ని ఆదేశించారు.    
సిఫార్సు