విశాఖ జిల్లాలో 45 సం.లు దాటిన వారందరూ కోవిడ్ టీకా తప్పక వేయించుకోవాలని జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన పరవాడ, అచ్యుతాపురం లలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాలను పరిశీలించారు. వాక్సినేషన్ కు వచ్చినపుడు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కు ధరించాలన్నారు. టీకా వేసుకున్న తరువాత కూడా కరోనా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ ఈ విషయాలపై క్షుణ్ణమై అవగాహ కలిగించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆయన పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వాక్సినేషన్ ను పరిశీలించారు. అనంతరం అచ్యుతాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వాక్సినేషన్ జరుగుతున్న తీరును గూర్చి వైద్యాధికారులతో మాట్లాడారు. వారికి సూచలు చేశారు. జేసీ వెంట అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.