జిల్లా పంచాయితీ అధికారిణిగా సుభాషిణి..
Ens Balu
3
Vizianagaram
2021-05-28 14:21:56
విజయనగరం జిల్లా పంచాయితీ అధికారి(ఎఫ్ఏసీ)గా ఎస్.సుభాషిణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో డిప్యుటీ డైరెక్టర్ హోదాలో, ఎంపిడిఓగా విధులు నిర్వహిస్తూ జిల్లాకు డిపిఓగా బదిలీపై వచ్చారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌ను కలిసి, అనుమతి తీసుకున్న అనంతరం, స్థానిక పంచాయితీ కార్యాలయంలో విధులను చేపట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా, సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తామని, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తామని, కోవిడ్ నిర్మూలనా కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, ఈ సందర్భంగా సుభాషిణి తెలిపారు.