ఆ ఎంపీడీఓ డిడీగా ఎక్కడ పనిచేశారో..?


Ens Balu
3
విజయనగరం
2021-05-28 15:31:30

ఆ వివాదాస్పద ఎంపీడీఓ ఎస్.సుభాషిణి మరో కొత్త వివాధానికి తెరలేపారు. తూర్పుగోదావరి జిల్లాలోని కెఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తూ అవినీతి ఆరోపణలపై సస్పెండై 8నెలల తరువాత ఆమె విజయనగరం జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసి)గా విధుల్లోకి చేరారు. చేరిన రోజే తన సర్వీసులో ఎక్కడా డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేయకుండానే తాను డిప్యూటీ డైరెక్టర్ గా వివిధ హోదాల్లో పనిచేసినట్టుగా మీడియాకి సమాచారశాఖ ద్వారా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పుదోవ పట్టించి, నమ్మించడానికే ఈ అధికారిణి ఈ విధమైన తప్పుడు ప్రచారం చేసినట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి ఈమె రెండు నెలల క్రితం విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా చేరడానికి ప్రభుత్వ జీఓతో విశ్వప్రయత్నాలు చేసి వెనుతిరిగారు. అపుడు విశాఖ జిల్లా మంత్రి అవంతిశ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఈమెను విధుల్లోకి చేర్చుకోలేదు. అంతేకాకుండా కాకుండా తూ.గోజిల్లాలో పిడింగొయ్యి పంచాయతీ విషయంలో సుమారు రూ.73.50 లక్షల అవినీతి వివాదంలో ఆమె బాధ్యత వహించాలటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జారీచేసిన నోటీసు  లో (1363546/cpr&rd/a2/2021,dated-26-03-2021) జిల్లా పంచాయతీ అధికారి పేర్కన్న అంశాన్ని ప్రధానంగా తెలియజేశారు. కొన్ని శాఖపరమైన విచారణలు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ  ఈమె డిపీఓ(ఎఫ్ఏసి) జీఓ రద్దై,  ఓ అధికారిణి  వేసిన కోర్టు కేసు పెండింగ్ లో ఉండగానే, విజయనగరం జిల్లా పంచాయతీ అధికారిణా విధుల్లోకి చేరడం, అదేరోజు తాను ఎంపీడీఓతోపాటు, డిప్యూటీ డైరెక్టర్ గా హోదాల్లో పనిచేశానని చేయని హోదాకి మీడియాకి ప్రకటన ఇవ్వడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈమె తన సర్వీసులో కేవలం ఎంపీడీఓగా మాత్రమే పనిచేశారు తప్పా మరెక్కడా డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన దాఖలాలు గానీ, ప్రభుత్వ ఉత్తర్వులుగానీ ఎక్కడా లేవు. ఆ విషయం తూర్పుగోదావరి జిల్లా పిడింగొయ్యి పంచాయతీలో జరిగిన అవినీతి వ్యవహారంలో కమిషనర్ ఇచ్చిన లేఖలోనే ఈమెను ఎంపీడీఓగానే కమిషనర్ గిరిజాశంఖర్ కూడా పేర్కొన్నారు. అలాంటిది చేయని హోదా చేసినట్టు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో అర్ధం కాని ప్రశ్నగా మారింది.  ఈ ఎంపీడీఓ చేయని హోదాలో పనిచేసినట్టుగా ప్రకటించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జిల్లాలో డీపీఓగా జాయినింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ విధంగా ప్రజాప్రతినిధుల దగ్గర చెప్పినమ్మించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా 73,53,720 రూపాయలకు ఎంపీడీఓ ఎస్.సుభాషిణిని బాధ్యురాలిని చేయాలని కూడా కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం, ఈమె అవినీతిపై వచ్చిన వార్తలు, విశాఖలో డీపీఓగా చేరాలని ప్రయత్ని విఫలయత్నం చేసిన అంశం, జిల్లా  మంత్రి తిరస్కరించిన అంశం, ఈ తరుణంలో ఓ పత్రికకు పరువునష్టం దావా వేసిన అంశం యొక్క ఆధారాలన్నీ విజయగనం జిల్లాలోని కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను తప్పుదారి పట్టించే విధంగా చేసే అధికారిణి కమిషనరేట్ లో జిల్లా పంచాయతీ అధికారిణిగా ఎలా ఉత్తర్వులు ఇచ్చారనేది, ఆపై జిల్లాలో ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది..ఈ విషయంలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాలి..!

సిఫార్సు