ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవేక్సినేషన్..
Ens Balu
2
Srikakulam
2021-05-28 15:45:06
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ బంగ్లా దరి గల ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. అర్బన్ మెడికల్ ఆఫీసర్ డా. కె.కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, వృద్ధాశ్రమంలోని 40 మంది వృద్ధులకు కోవిషీల్డ్ వేక్సినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో వేక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కాకుండా కోవిడ్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తొలిదశలో 60 ఏళ్లు పైబడినవారికి, ప్రంట్ లైన్ వారియర్స్ కు వేక్సినేషన్ చేసారు. మలిదశలో 45 ఏళ్లకు పైబడి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధిగ్రస్తులకు కూడా అవకాశం కల్పించిన సంగతి అందరికి విదితమే. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలి ప్రాధాన్యతను ఇస్తూ, 45 నుండి 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వేక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం జె.ఆదిలక్ష్మీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ సిహెచ్.ఐశ్వర్య, ఆశా వర్కర్ బి.జ్యోతి, వాలంటీర్ జి.ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.