ఆ ఆసుపత్రికి రూ.22.55లక్షలు జరిమానా..


Ens Balu
2
Kakinada
2021-05-28 15:51:53

డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, రూ.4,50,000 వ‌సూలు చేసినందుకు కాకినాడ‌లోని ఇనోద‌య ఆసుప‌త్రికి అయిదు రెట్లు మొత్తాన్ని రూ.22,50,000 పెనాల్టీగా విధించిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆరోగ్య‌శ్రీ కింద కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుప‌త్రిలో చేర్చుకున్న‌ప్ప‌టికీ త‌మ నుంచి రూ.4,50,000 మొత్తాన్ని వ‌సూలు చేశారంటూ రోగి ఎం.స‌త్తిరాజు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును జేసీ (డీ) కీర్తి చేకూరి నేతృత్వంలోని డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్ట్ జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీసీసీ) ప‌రిశీలించింది. వివిధ ఆధారాల‌ను ప‌రిశీలించిన క‌మిటీ  రోగి నుంచి వ‌సూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఆయ‌న‌కు చెల్లించ‌డ‌మే కాకుండా.. రూ.22,50,000 పెనాల్టీ మొత్తాన్ని డీసీసీ, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ పేరిట డీడీ తీసి అంద‌జేయాల‌ని లేదా నిర్దేశ ఖాతాకు బ‌దిలీ చేయాల‌ని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చిన‌ట్లు జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. అదే విధంగా కోవిడ్ చికిత్స నుంచి ఆసుప‌త్రిని డీనోటిఫై చేసి, క్రిమినల్ కేసు బుక్ చేశ మని,  సంబందిత ఆరోగ్య‌మిత్ర కె.నాగ‌మ‌ణికి షోకాజు నోటీసులు జారీచేసిన‌ట్లు కీర్తి చేకూరి తెలిపారు.
సిఫార్సు