డార్విన్ మరో 5 ఆక్సిజన్ మిషన్లు వితరణ..
Ens Balu
2
Kakinada
2021-05-28 15:53:28
డార్విన్ ఫార్మా (విజయవాడ) సంస్థ.. జిల్లాకు మరో అయిదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఎస్‌సీవీ రత్నారెడ్డి శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారిని కలిసి కాన్సంట్రేటర్లను అందించారు. కోవిడ్ బాధితులకు అవసరమైన ప్రాణ వాయువును అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చిన డార్విన్ ఫార్మాకు జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) అభినందనలు తెలియజేశారు. కోవిడ్ విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో డార్విన్ ఫార్మాకు చెందిన డా. వి.రవికుమార్, డా. ఎన్.మురళిలు యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండేషన్, వెస్ట్ టెక్సాస్ ఇండియన్ డాక్టర్స్ గ్రూప్ సహకారంతో ఒక్కోటి రూ.లక్షా పదివేలు విలువైన అయిదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు రెండు వెంటిటేర్లను ఇటీవల జిల్లాకు అందించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.