మత్స్యకారులంతా కోవిడ్ వేక్సిన్ వేసుకోవాలి..
Ens Balu
2
Vizianagaram
2021-05-29 03:28:55
విజయనగరం జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన మత్స్యకారులంతా ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ వేక్సిన్ వేసుకొని సురక్షితంగా ఉండాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి కోరారు. శనివారం ఈ మేరకు ఆమె మీడియాకి ప్రకటన విడుదలచేశారు. మత్స్యకార గ్రామాల్లో అందరూ ఒకే చోట గుమిగూడి సమావేశాలు పెట్టుకోవద్దని, ఖచ్చితంగా మనిషికి మనిషికీ మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు తరువాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. వేక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే తక్షణమే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం 104 కాల్ సెంటరు ను సంప్రదించాలన్నారు.