దేశం ఆరోగ్యం కోసమే ఫిట్ ఇండియా ఫ్రీడం రన్..
Ens Balu
3
Ramakrishna Beach
2020-08-29 17:24:30
ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ అన్నారు. శనివారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రమ్ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ పాయింట్ నుంచి ఆర్కే బీచ్ వరకూ రన్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడు తూ, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వాల్తేరు డివిజన్ ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 2, 2020 వరకు “ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్” ను నిర్వహిస్తోందిన్నారు. కరో నా వైరస్ ను నియంత్రించడానికి ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. దానికోసం ప్రతీఒక్కరూ ఫిట్ గా ఉండాలన్న ఆయన, రోజులో ఏదో సమయంలో ఖచ్చితంగా సుమారు గంటపాటు నడవాలన్నారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడు తూ, ప్రతీఒక్క ఉద్యోగి ఆరోగ్యంగా ఉండటం ద్వారా ప్రయాణీకులకు సర్వీసులు అందించడానికి ఉపయోగకరంగ వుంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సంద ర్భంగా కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.