వేక్సిన్ కు డబ్బులు తీసుకుంటారా..?
Ens Balu
2
Arilova
2021-05-29 11:42:34
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్లో ఆశా వర్కర్ డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదు పై జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి స్పందించి కేంద్రాన్ని సందర్శించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు వస్తున్నా ఫిర్యాదుపై మేయర్ ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం పరుస్తూ తక్షణమే విచారణ చేపట్టాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు విచారణలో తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ జివిఎంసి అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలోను, ఆరిలోవ మరియు మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లోను వేయబడుచున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జివిఎంసి అన్ని సెంటర్లలోను ఉచితంగా వ్యాక్సిన్ వేయబడుచున్నదని, వ్యాక్సిన్ కొరకు ఎవ్వరూ ఎటువంటి డబ్బులు చెల్లించనవరసం లేదని, ఎవ్వరైనా వ్యాక్సినేషన్ కొరకు డబ్బులు డిమాండ్ చేసినయడల వెంటనే జివిఎంసి టోల్ ఫ్రీ నెం. 1800 4250 0009 లేదా 0891-2869100కి తెలియపరచవలెనని, వారిపై వెంటనే కఠినచర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎటువంటి అపోహలకు పోకుండా 45సంవత్సరములు దాటిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ వేసే సిబ్బందికి సహకరించాలని మేయర్ ప్రజలకు సూచించారు.