యుజిడీలో నగర వాసులు డైపర్స్ వేయకూడదు..


Ens Balu
2
Vepagunta
2021-05-29 11:49:09

భూగర్భ మురుగునీటిలో నగర వాసులు డైపర్స్ వేయకూడదని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన సూచించారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎనిమిదవ జోన్ పరిధిలోని 98వ వార్డు వేపగుంట సింహపురి కోలనీ లో శనివారం కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ మురుగునీరు కొన్ని చోట్ల బ్లాక్ అయి పొంగుచున్నదని ముఖ్యంగా గృహాలలో మహిళలు, పిల్లలు వాడే డైపర్స్ లు వేయటంవలన డ్రైనేజి లో అడ్డంకులు ఏర్పడి మురుగునీరు బ్లాక్ అయి ఎక్కడికక్కడ పొంగి పోతుందని అందువలన డైపర్స్ లాంటివి డ్రైనేజి లో వేయరాదని సూచించారు. వెంటనే మ్యాన్ హొల్స్ తెరచి వాటి అడ్డంకులను తొలగించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. కాలువలు, రోడ్లను శుభ్రంగా చేయాలని, ప్రతిరోజూ చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. తడి-పొడి చెత్త వేరు వేరుగా పారిశుధ్య సిబ్బందికి అందించాలనారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని రోడ్లు మరియు కాలువలో చెత్త వేస్తే ఆ చుట్టు ప్రక్కలున్న ఇళ్ళకు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. కారులు పెట్టుకొనుటకు రోడ్లను ఆక్రమించి షెడ్లు నిర్మించడం గమనించి వెంటనే వాటిని తొలగించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. అందరు కోవిడ్ నిబంధనలను పాటించాలని కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటెనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుకుమార్, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.  
సిఫార్సు