సరిపడ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు సిద్దం..
Ens Balu
2
Kakinada
2021-05-29 11:51:29
కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఉదయం జేసీ (డీ) వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి కాకినాడ జేఎన్‌టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించారు. రిసెప్షన్, రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం బాధితులతో మాట్లాడారు. అవసరం మేరకు కాన్సంట్రేటర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్న తీరును పరిశీలించారు. కాన్సంట్రేటర్లలో సమస్యలు తలెత్తితే వెంటనే తెలియజేయాలని, బయో మెడికల్ ఇంజనీర్ల సహాయంతో సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. పారిశుద్ధ్యం, భోజనం విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేశారు. రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరం మేరకు సేవలు అందేలా చూడాలని కీర్తి చేకూరి పేర్కొన్నారు. జేసీ (డీ) కీర్తి చేకూరి వెంట కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో) డా. ఆర్.సుదర్శన్‌బాబు తదితరులు ఉన్నారు.