కరోనాను నియంత్రణలో NGOలు కీలకం..


Ens Balu
2
Srikakulam
2021-05-29 12:03:05

శ్రీకాకుళం జిల్లాలో కరోనాను ఆరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు (ఎన్. జి.ఓ) కీలక పాత్ర పోషించాలని సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనువాసులు పిలుపునిచ్చారు. 32 ఎన్.జి.ఓల సభ్యులతో  సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనువాసులు సమీక్షాసమావేశం నిర్వహించారు. జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి 8 వందల సచివాలయాల్లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో  కోవిడ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన  సూచించారు.  45 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సినేషన్  అందేలా చూడాలని  ఆయన అన్నారు. 60 సంవత్సరాలు పైబడినవారికి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి  ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయితీ సర్పంచ్ లు , వాంటీర్లతో కలసి కరోనాపై  తీసుకోవలసిన జాగ్రత్తలు, వాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో కోవిడ్ భారీన పడిన వారికి  కోవిడ్ మెడికల్ కిట్స్ అందజేశామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కూడా మెడికల్ కిట్స్ అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కోవిడ్ బారిన పడిన వారికి వెంటనే  వైద్య సదుపాయాలు అందించడానికి సరిపడా అంబులెన్స్ లు, 104 వాహనాలు కూడా అదనంగా పెట్టామని  దీనిపై అవగాహన  కల్సించవలసిన భాద్యత ఎన్.జి.ఓలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల్లో సహజంగా దొరికే   నిమ్మ, తాజాకూరగాయలు, పండ్లు, పసుపు తదితర పౌష్టికాహారం తీసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జెసి అన్నారు. ప్రస్తుతం  పెళ్లిళ్ల సీజన్ అని విందులు, వినోదాల్లో ఎక్కువ జనం గుమికూడకుండా ఉండేటట్లు చూదాలని సూచించారు. పంచాయతీ సర్పంచులు, వలంటీర్స్ తో  కలసి సమన్వయం చేయాలని అన్నారు.  కరోనాతో ప్రతీ ఒక్కరూ సహజీవనం చేయవలసందేనని, కరోనా భారిన పడకుండా ఉండాలంటే బౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్కు ధరించడం చేయాలని సూచిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని అన్నారు.

 
రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ  కరోనా భారీన పడి మృతి చెందిన 160  మృతుదేహలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా దహన సంస్కారాలు చేశామన్నారు. అనాథ మృత దేహలను కూడా దహన సంస్కారాలు కార్యక్రమాలు చేశామన్నారు. అనేక మందికి ప్లాస్మా డోనేషన్ చేశామన్నారు. లాక్ డౌన్ సమయంలో  ప్రతి రోజు సుమారు వెయ్యి  మందికి భోజనం అందిస్తున్నామన్నారు. పేదలకు  మాస్కులు, శానిటేజర్స్ అందజేస్తున్నామన్నారు.  ప్లాస్మామా డోనర్స్ ఎవరైనా ఉంటే  మాకు తెలియపర్చాలని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ వలన కరోనాపై అవగాహన, వైద్య సదుపాయాలు, ప్రభుత్వం అందించే ఇతర సహాయ సహాకారాలు అందించడం వేగవంతంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. యూత్ క్లబ్ బెజ్జిపురం రెడ్ క్రాస్ సొసైటీకి రూ.20 వేలు చెక్కును అందజేశారన్నారు. ప్రభుత్వం తరుపున  సహాయ అందిస్తే   రెడ్ క్రాస్ తరపున  మరిన్నీ సహాయ కార్యక్రమాలు  చేపడతామన్నారు.

 
 బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు యం.ప్రసాద రావు మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో  కరోనా పై  అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. లావేరు మండల గ్రామాల్లో ఎం.డి ఒ, ఎం.ఆర్.ఓల  ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపణీ చేశామన్నారు. 120 అంగన్వాడీ కేంద్రాల్లో యోగ క్లాసులు నిర్వహించామన్నారు. 126  ప్రభుత్వ పాఠశాలలో  కరోనాపై అవగాహన, యోగ  క్లాసులు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో  92 మంది ట్రాన్స్ జండర్స్ కి  రూ.15 వందల ఆర్థిక సహాయంపై అవగాహన కల్పిస్తూ  ఆన్ లైన్  చేశామన్నారు. జిల్లాలో 9 మంది హెచ్.ఐ.వి భారిన పడిన వారికి ఇంటి వద్దకే  తీసికెళ్లి మందులు అందచేశామన్నారు. అలాగే తల్లిదండ్రులను కొల్పోయిన పిల్లలకు సహాయ సహాకారాలు అందిస్తున్నామని అన్నారు.

           సి.ఏ.వి.ఎస్ ఎన్.జి.ఓ వ్యవస్థాపకులు  పి.భూదేవి మాట్లాడుతూ  15 మంది సిబ్బందితో కలసి గ్రామాల్లో కరోనా పై అవగాహన కల్పిస్తూ  సిరిదాన్యాలు  అందజేశామన్నారు. జిల్లాలో 600 మెడికల్ కిట్స్ అందజేశామన్నారు. జిల్లాలో న్యూట్రిషన్ ఫుడ్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు చేయిస్తున్నామన్నారు.  ఈ సమావేశంలో ఇతర ఎన్.జి.ఓల సిబ్బంది  పాల్గొన్నారు.
సిఫార్సు