తెలుగు భాష అమ్మవంటిది...రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి


Ens Balu
3
Ramakrishna Beach
2020-08-29 17:30:55

తెలుగుభాష అమ్మవంటిదని అమ్మను ఎల్లప్పుడూ గుర్తించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం తెలుగుని భాగస్వామ్యం చేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా  శనివారం ఆర్.కె.బీచ్ లో తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు భాషను గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రామసచివాలయాల్లో సైతం ఫిర్యాదులు, దరఖాస్తులు తెలుగులోనే స్వీకరించడంతో పాటు, అందరికీ అర్ధమయ్యేలా నోటీసు కూడా తెలుగులోనే ఇవ్వాలనే నిబంధన పెట్టారన్నారు. రాష్ట్రంలో తెలుగు అధికార భాష ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర  అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.