జూన్ 1నుంచి బలవర్ధపు బియ్యం పంపిణీ..


Ens Balu
3
Vizianagaram
2021-05-29 12:26:17

సూక్ష్మ పోషకాలున్న బలవర్దపు (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని జూన్ 1వ తేదీ నుండి జిల్లా అంతటా పంపిణీ చేయనున్నట్లు సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కీషోర్ కూమర్ తెలిపారు.  ప్రస్తుతం బొబ్బిలి, పార్వతిపురం తెర్లాం, సాలూరు నియోజక వర్గాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  శనివారం  కలెక్టరేట్ ఆడిటోరియం లో పాత్రికేయుల సమావేశం లో ఆయన మాట్లాడరు. ఈ బియ్యం పై ప్రజల్లో రక రకాల  అపోహలు ఉన్నాయని, నిజానికి ఈ బియ్యం సాధారణ బియ్యమేనని, అయితే మిల్లింగ్ సమయం లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12  ను జత చేయడం  జరుగుతుందని తెలిపారు.  దీని వలన రక్త హీనత రాకుండా చేయడమే కాకుండా, పోషకాలు  లభిస్తాయని, గర్భిణీ లలో పిండం అభివృద్ధి, నాడీ వ్యవస్థ పని తీరు సాధరణంగా ఉంటాయని తెలిపారు.  ప్రజల్లో  అపోహ పోయి, అవగాహన పెంచాలని అన్నారు. జూన్ 1 నుండి  జిల్లాలోనున్న  7 లక్షల కార్డు దారులకు ఈ బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
        ఈ ఏడాది మొక్క జొన్న ఇంతవరకు 38 వేల మెట్రి టన్నులు సేకరించడం  జరిగిందని,  గత ఏడాది 60 వేల మెట్రి టన్నులు సేకరించామని అన్నారు. పంట ఎక్కువ వచ్చినందున గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ చేస్తామని తెలిపారు.  రైస్ కార్డ్ లలో విభజనలు,  జత చేయడం తొలగింపులు,  సరండర్ చేయుటకు 10 రోజులు గడువు ఉందని,  ఇంతవరకు 1లక్ష 42 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు.  ఏం.డి.యు వాహనాల ద్వారా రేషన్ సరఫరా లో ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లా మొదటి స్థానం లో ఉందని పేర్కొన్నారు.   ఖరీఫ్ లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని రబీ లో ఇంతవరకు 26 వేలను  సేకరించడమైందని,  మరో 10 వేల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పండించిన ప్రతి గింజను కొంటామని, రైతులు ఆందోళన చందనవసరం లేదని అన్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని, విత్తనాలు,  పురుగుమందులు, , ఎరువులు అవసరమైనన్ని సరఫరాచేయడం  జరుగుతుందన్నారు.         ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా  రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు