తడి పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలి..
Ens Balu
2
విశాఖ సిటీ
2021-05-29 12:30:21
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. శనివారం జివిఎంసీ పరిధిలోని రెండవ జోన్ 11వ వార్డు పరిధిలో ఆరిలోవలో శనివారం ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల ను ఆమె పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హెచ్.పి.సి.ఎల్ 23వేల డస్ట్ బిన్లను జివిఎంసికి అందించిందని మేయర్ తెలిపారు. విశాఖను సుందర నగరంగాను, చెత్త రహిత నగరంగాను తీర్చిదిద్దవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళలుగా ఆ బాధ్యత మనపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజు సిబ్బంది డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయడం జరుగుతుందని, తడి-పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్త వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని మేయర్ సూచించారు. చెత్తను రోడ్ల పైన కాలువలలోను వేయరాదని ప్రజలకు సూచించారు. ప్రతీ దుకాణాల ముందు మూడు డస్ట్ బిన్లు ఉండాలని సూచించారు. హెచ్.పి.సి.ఎల్. యాజమాన్యం ఈ డస్ట్ బిన్లను సమకూర్చిందని వారికి మేయర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి.రాము, వెటర్నరి డాక్టరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.