మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వేక్సిన్ ఆదివారం జరపడం లేదని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈమేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నగరంలోని ఆరిలోవ, మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లలో వ్యాక్షినేషన్ చేయడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడు చేస్తున్నారనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంటి పట్టునే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.