అనంతపురం నగరంలో ప్రధాన కాలువల్లో మరువంతక పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ వసీం శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు ధరణి కేఫ్ నుంచి అశోక్ నగర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న పూడికతీత పనులను శనివారం మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి వర్షం నీరు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని త్వరితగతిన పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా మరువ వంక చివరి వరకు పూడికతీత పనులు చేపట్టాలని తద్వారా వర్షపునీరు ముందుకు వెళ్లేందుకు ఆటంకం లేకుండా ఉంటుందని సూచించారు. కేవలం మరువ వంకలోనే కాకుండా చిన్న కాలువల్లో కూడా పూడికతీత చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు సోని రమణ, నరసింహులు, డి ఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.