రెండో సారి నేషనల్ ఎనర్జీ లీడర్ గా విశాఖ ఉక్కు...


Ens Balu
3
Steel Plant
2020-08-29 18:15:14

జాతీయ స్థాయిలో అత్యుమత్త ఇంధన పరిరక్షణ సామర్ధ్యం సాధించిన సంస్థగా నిలిచినందుకు, విశాఖ ఉక్కుకు “నేషనల్ ఎనర్జీ లీడర్”  గా కూడా రెండోసారి బహు మతి లభించిందని సీఎంఎడీ పికెరథ్ తెలియజేశారు. వరుసగా మూడేళ్ళపాటు దేశవ్యాప్తంగా వున్న స్టీలు ప్లాంటులతో పోటీ పడుతూ, ఈ అవార్డును విశాఖ ఉక్కు ద క్కించుకోవడం ఆనందంగా వుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్లీలుప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్-2 లో పి.సి.ఐ. ని పెంపొందించడం, బ్లాస్ట్  ఫర్నేస్ లో ఇంధనపు ప్రమాణాన్ని అనుకూలపరచడం, ఆర్గాన్ రికవరీ, టర్బో బ్లోయర్సు ను అనుసంధానించడం లాంటి వినూత్న పద్ధతులు అమలుపరచడం తో పాటు వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయడం ద్వారా  సమర్ధ ఇంధన నిర్వహణ వీలుపడిందని ఆయన పేర్కొన్నారు. ప్లాంటు నిర్వహణతోపాటు, జాతీయ స్థాయిలో అవార్డు లు రావడానికి కారణమైన సిబ్బందిని, అధికారులను సీఎండీ  ఈ సందర్భంగా అభినందించారు.