అప్పన్న దర్శన సమయం 2 గంటలు పెంపు..
Ens Balu
3
Simhachalam
2021-05-30 07:59:47
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న దర్శన సమయాన్ని మరో రెండుగంటలు పెంచుతున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఆదివారం ఈమేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యర్ధం ఉదయం 7:30 గంటల నుంచి 11:30 వరకూ సమయాన్ని పెంచినట్టు వివరించారు. ఆ నాలుగు గంటలసమయంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవచ్చని ఈఓ తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ తప్పక ధరించాలని, హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరని, భౌతిక దూరం పాటిస్తూ స్వామిని దర్శించుకోవాలన్నారు. టికెట్ కౌంటర్ల దగ్గర- క్యూ లైన్లలో భక్తులకు ఎలాటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు.