వైఎస్ జగన్ జనరంజక పాలనకు రెండేళ్లు..


Ens Balu
1
Ramachandrapuram
2021-05-30 12:56:22

సుధీర్గమైన తన పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని ప్రజల కష్టాలను మనసు తో చూసిన ముఖ్యమంత్రి  వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన రెండేళ్ళ పాలనలో ప్రజా సంక్షేమమే మొదటి ఎజెండా గ పాలన సాగించారని బిసి సంక్షేమ శాఖా మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ  అన్నారు. వైఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో రెండేళ్ళ పాలన పూర్తీ చేసుకున్న సందర్బంగా పట్టణములోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం మంత్రి వేణు గోపాల కృష్ణ పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టి కార్యాలయంలో నాయకులు ప్రజాప్రతినిదుల సమక్షంలో కేకు ను కట్ చేసి స్వీట్లు పంచారు , ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధిజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యమును దేశములో ఎక్కడా లేని విదముగా గ్రామ సచివాలయ వ్యవస్డను తీసుకుని వచ్చి ప్రభుత్వ పధకాలను ప్రజల వద్దకే నేరుగా అందించిన ఘనత సి.యం జగన్ మోహన్ రెడ్డి ది అన్నారు. గతములో టిడిపి హయాంలో జన్మభూమి కమిటి లతో అవినీతికి బార్ల తెరిచిన టిడిపి ప్రభుత్వమునకు బిన్నంగా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పడకాలని నేరుగ లబ్దిదారుఅల్ ఖాతాలకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం అందిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రెండేళ్ళ ప్రభుత్వ పాలన లో సి.యం జగన్ మోహన రెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో స్దానం సంపందించారు అన్నారు. గతములో ఏ ప్రభుత్వం చేయని విదముగా ఈ రెండేళ్ళ కాలములో అన్ని వర్గాల వారికి రూ 1.83  లక్షల కోట్లు ప్రజలకు నేరుగా సంక్షేమ పదకాల ద్వారా అందించడం జరిగింది అన్నారు. ఏడాది నర కాలము గా కరోనా కష్ట కాలములో రాష్ట్ర ప్రజలు ఎటువంటి యిబ్బందిలు ఎదుర్కోనరాదని  ఎన్ని యిబ్బందులు ఉన్న ఒక్క సంక్షేమ పదకాన్ని కూడా ఆపకుండా అందించిన ఘనత సి.యం జగన్ మోహన రెడ్డి ది అన్నారు. గతములో తెలుగుదేశం ప్రభుత్వం బి.సి లను ఓటు బ్యాంకు గ వాడుకుంటే జగన్నన్న ప్రభుత్వం బి.సి లు వెన్నుముక్క లాంటి వారు అని పేర్కొంటూ వెన్ను దన్ను గా నిలిచారు అన్నారు. 13 జిల్లాలోని 139 బి.సి కులాలను ఏక తాటిపైకి తీసుకుని వస్తూ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి బిసి లకు రాజ్యంగా పదవులు యిచ్చిన ఘనత సి.యం జగన్ మోహన రెడ్డి ది అన్నారు. కార్పోరేషన్లు ఏర్పాటు ద్వారా రూ 83000 కోట్లు బిసిలకు అందించడం లో ఆయా కులాలలో చెరగని ముద్ర వేశారు అన్నారు. 
జిల్లా లో అన్ని వర్గాల వార్కి పారదర్శకం గా సంక్షేమ పధకాలను అందించడం జరిగింది అన్నారు. జగనన్న చేదోడు పదకం ద్వారా ట్రైలర్స్ , నాయి బ్రాహ్మిణ లు రజకులకు 25078 మందికి రూ 2.50 కోట్లు రెండవ విడత లో 30519 మందికి రూ 3.05 కోట్లు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది అన్నారు. కాపు నేస్తం పడకం ద్వారా రెండు విడతలు గా 97353 లబ్దిదారులకు రూ 14.60 కోట్లు బ్యాంకు ఖాతా లలో జమచేయడం జరిగింది అన్నారు. రెండేళ్ళ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టి ప్రభుత్వ పాలనలో రామచంద్రాపురం నియోజక వర్గము లో సంక్షేమ పదకాల ద్వార లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగినది అన్నారు.