యువతకు సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వాలి..
Ens Balu
4
Visakhapatnam
2020-08-29 18:32:20
భారత ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన మేకిన్ ఇండియా పిలుపుమేరకు మొబైల్ యాప్స్ గణనీయంగా పెరుగుతున్న తరుణంలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలెప్ మెంట్ కేంద్రాల ద్వారా సాఫ్ట్ వేర్ రంగంపై శిక్షణ ఇవ్వాలని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేసే సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం వుంటుందన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ శాఖల్లో నిర్మాణమవుతున్న మొబైల్ యాప్స్ కి ఇలా సాఫ్ట్ వేర్ లో శిక్షణ ఇచ్చిన వారికి ఉపాది కల్పించాల న్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే టెక్నాలజీలపై నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాది దొరకడంతోపాటు, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు. ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయకపోవడం వలన ఈ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేసినా, ఇతర ప్రాంతాలకి చెందిన వారికే కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా స్థానిక యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి నిరుద్యోగులకు ఉచితంగా సాఫ్ట్ వేర్ రంగాలపై శిక్షణ ఇవ్వాలని రామ్ కుమార్ డిమాండ్ చేశారు.