వరుసగా 4సార్లు ఫీవర్ సర్వేలో మొదటి స్థానం..


Ens Balu
2
Ongole
2021-05-30 14:33:00

ప్రకాశం జిల్ల కలెక్టర్ పోలాభాస్కర్ ముందు చూపు..జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్ కార్యదీక్ష..ఎంపీడీఓల చురుకుదనం.. గ్రామ వాలంటీర్ల శ్రమ..వెరసీ ప్రకాశం జిల్లా వరుసగా 8, 9, 10, 11 నాలుగు దఫాలుగా ఫీవర్ సర్వేలో ముందు వరుస నిలుచుంది. అంతేకాదు ఈ జిల్లాలో కరోనా రోగులకు అందించే సేవల విషయంలో ఇక్కడి నోడల్ అధికారులు చురుకైన పాత్ర పోషిస్తూ...వైద్య సేవలు అందించే విషయంలో ప్రజల మన్ననలు పొందారు. ఈ జిల్లాలో కరోనా పాజిటివ్ రోగులకు ఆసుపత్రులు, ప్రత్యేక కోవిడ్ కేర్ కేంద్రాల్లో బెడ్లు ఇప్పించే విషయంలోనూ అధికారు చేస్తున్న సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. జిల్లా యంత్రాంగం బాగా పనిచేస్తే ఒకసారి జిల్లా ఫీవర్ సర్వేలో మొదటి స్థానం సంపాదించుకుంటుంది. ఈ లెక్కన చూస్తే ఏ స్థాయిలో పనిచేస్తే వరుసగా నాలుగు సార్లు ప్రకాశం జిల్లా ఫీవర్ సర్వేలో మొదటిస్థానంలో నిలిచిందంటే ఇక్కడి కలెక్టర్ కార్యదీక్ష..ప్రజలకు సత్వరమే సేవలందించాలనే తపన ఏస్థాయిలో ఉందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు...ప్రకాశం జిల్లా మాదిరిగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల అధికారులు పనిచేస్తే ప్రభుత్వానికి ఈ కోరనా సమయంలో మరింతగా సేవలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.. రధసారధి ఉత్తముడైతే వచ్చే ఫలితాల ఈ విధంగానే ఉంటాయనడానికి ప్రకాశం జిల్లా ఒక నిలువెత్తు నిదర్శనం..

సిఫార్సు