జూన్ 30 వరకూ వేసవి సెలవులు పొడిగింపు..


Ens Balu
1
విజయనగరం
2021-05-30 14:47:10

 రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో వుంచుకొని రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల లోని స్కూళ్లకు వేసవి సెలవులు జూన్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. 1 నుంచి 10 వరకు తరగతులు నిర్వహించే అన్ని పాఠశాలల కు ఇవి వర్తిస్తాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. జూన్ 12 నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ చర్యలు మరో నెల రోజులపాటు జూన్ 30 వరకు అమలు చేయాలని ఈ నెల 29న ఒక సర్క్యులర్ జారీ చేసిందని, దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.