ఐదుగురు వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు..


Ens Balu
2
Anantapur
2021-05-30 15:18:15

రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఫీవర్ సర్వే ఆధారంగా కరోనా లక్షణాలున్న వారికి సకాలంలో టెస్టులు నిర్వహించని ఐదుగురు మెడికల్ ఆఫీసర్లకు షోకాజు నోటీసులు జారీ చేశారు. గుమ్మగట్ట, కొండాపురం, గుడిబండ, గోరంట్ల, ఆవులదట్ల పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు షోకాజ్ నోటీసులను అందుకున్నారు. ఆదివారం ఫీవర్ సర్వే-టెస్టులు అంశంపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించి ఫీవర్ సర్వేను ఆధారంగా సేకరించిన డేటాను కరోనాను కట్టడి చేసేందుకు వినియోగించాలన్నారు. ఫీవర్ సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే టెస్టులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం సర్వేలో కరోనా లక్షణాలు కలిగివుండి, కరోనా టెస్టు పెండింగ్ లో వారికి ఉన్న నేడు సాయంత్రం లోగా టెస్టులు పూర్తి చేయాలన్నారు. 

వాలంటీర్లు గతంలో కరోనా వచ్చిన వారిని కూడా జ్వర లక్షణాలు కనిపించగానే ఫీవర్ సర్వేలో నమోదు చేయడం వల్ల డూప్లికేషన్ సమస్య ఉత్పన్నమవుతోన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమయ్యే ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

కాన్ఫరెన్సులో జేసీ సిరి, జేసీ గంగాధర్ గౌడ్, డీఎంహెచ్ఓ కామేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

సిఫార్సు