విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న దర్శనాల సమయం పెంచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఈఓ ఎంవీ సూర్యకళ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద టిక్కెట్టు కౌంటర్ ను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్ధం రూ.300, 100, టోల్ గేట్ల టిక్కెట్లను ఒకే చోట ఇవ్వాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో పెట్టుకొని క్యూలైన్యలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రధాన ప్రాంతాల్లో భక్తులకు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అంతరాలయం, టిక్కెట్ కౌంటర్, క్యూలైన్లు, ఇత్తడి, రాగి గ్రిల్స్ పాలిషింగ్ పనులను ఈఓ పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఏఈఓ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.