భగవంతుని సేవ పూర్వజన్మ సుకృతం..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-05-31 06:39:56
భగవంతునికి సేవ చేసుకునే అవకాశం రావడం వారి పూర్వ జన్మ సుకృతమనీ ,ఆలయాలు అద్యాత్మిక, ప్రశాంతతకు విశాఖ మారుపేరని ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ అన్నారు. సోమవారం ఎంపీ ఎంవీవీని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి స్వామివారి చందన ప్రసాదాన్ని అందజేసి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి అప్పన్న చిత్ర పటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ, ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు భక్తులకు విశేష సేవలు అందించడానికి ఇది చక్కని అవకాశమని ఎంపీ పేర్కొన్నారు. సభ్యులంతా అంకిత భావం తో సేవలు అందించి అందరి మన్ననలు పొందాలని, దేశంలోనే ప్రముఖ దేవస్థానంగా భక్తుల మధిలో సింహాద్రి అప్పన్న నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అందాల లో సింహగిరి ప్రత్యేకమన్న ఎంపీ ఆధ్యాత్మిక రంగాన్ని అభివ్రుద్ధి చేసేందకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటుందన్నారు. రెండు అవతారాలు కలిసిన సింహాద్రి నాధుడు దర్శనం సాధారణ భక్తులకు చేరువయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు ఎస్. కే.రత్నం, యండమూరి విజయ, దశమంతుల మాణిక్యాలరావు మేడిద మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.