కనకదుర్గమ్మకు గంట్ల ప్రత్యేక పూజలు..


Ens Balu
1
మధుసూధన నగర్
2021-05-31 06:53:07

విశాఖలోని 47వ వార్డు మధుసూధన్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జాతీయజర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సోమవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ లో పదుల సంఖ్యలో జర్నలిస్టు మిత్రులను కరోనా పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబాలను ఆ దుర్గమ్మ చల్లగా కాపాడాలని వేడుకున్నానని, అదే సమయంలో ప్రభుత్వాలు ముందుకి వచ్చి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని శ్రీనుబాబు డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు సార్లు ఇదే విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులకు  అర్జీలు పెట్టామన్నారు.  జర్నలిస్టులందరికీ, యాక్సిడెంటల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ తక్షణమే అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ, కార్డులు, అక్రిడిటేషన్లు కూడా వెంటనే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.