ఖజానా శాఖలో కారుణ్య నియామకం..
Ens Balu
1
Srikakulam
2021-05-31 08:55:30
కోవిడ్ భారీనపడి మృతి చెందిన ఉప ఖజానా అధికారి పి.ఢిల్లేశ్వర రావు కుమారడు పి.నీరజ్ కుమార్ కు కారుణ్య నియామక పత్రాన్ని అందజేసారు. సోమ వారం జిల్లా ఖజానా కార్యాలయంలో ఖజానా ఉప సంచాలకులు పి.సావిత్రి ఈ నియామక పత్రాన్ని నీరజ్ కుమార్ కు అందజేసారు. నీరజ్ కుమార్ తండ్రి ఢిల్లేశ్వర రావు పాతపట్నం ఉప ఖజానా అధికారిగా పనిచేస్తు ఏప్రిల్ 22వ తేదీన కోవిడ్ తో మృతి చెందారు. ఢిల్లేశ్వర రావు కుటుంబ సభ్యులు కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి నీరజ్ కుమార్ కు జూనియర్ అకౌంటెంట్ గా నియామక పత్రాలు అందజేసామని ఉప సంచాలకులు తెలిపారు. నియామకపు ఉత్తర్వులు త్వరితగతిన అందజేసి కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఢిల్లేశ్వర రావు కుటుంబ సభ్యులు, ఖజానా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి సేవలు అందించి మన్ననలు పొందాలని ఉప సంచాలకులు, ఉద్యోగులు సూచించారు.