పుట్టినరోజు ఖర్చుతో పేదల ఆకలి తీర్చారు..
Ens Balu
3
Rajahmundry
2021-05-31 09:32:31
కరోనా సమయంలో తన బిడ్డ పుట్టిన రోజు వేడుక కోసం చేయాలనుకున్న ఖర్చుతో ఆపన్నుల ఆకలి తీర్చాలినుకున్నాడా చిన్న ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ 4వ తరగతి కాంట్రాక్టర్ కాకి రవిబాబు. రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఈయన తన కూతరు ప్రియాంక పుట్టిన రోజు సందర్భంగా వారే స్వయంగా వంట చేసుకొని భార్య ప్రేమజ్యోతి, కొడుకు గుణసాయితేజ, కూతుర్లు, కుటుంబ సభ్యులతో స్వయంగా వాటిని తీసుకెళ్లి పేదలకు ఒక పూట కడుపు నింపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రాజమండ్రిలోని సేవా తపన సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆన్నదానం కార్యక్రమం చేపట్టి ఆహారాన్ని పొట్లాలుగా చేసి పండ్లు, మంచినీటి ప్యాకెట్లతో సహా పంపిణీ చేశారు. వీరింట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి ప్రతీకగా పేదల కడుపు నింపే అన్నదానం చేస్తారీ కుటుంబ సభ్యులు. కరోనా సమయంలో మనసున్న దాతలు ఈ విధంగా ఆలోచిస్తే ఎందరో అభాగ్యులకు ఒక్కపూట ఆకలితీరుతుంది.. ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న..!