యుపిఎస్ సి పరీక్షలు సజావుగా నిర్వహించాలి..జెసి
Ens Balu
3
విశాఖ కలెక్టరేట్
2020-08-29 19:13:21
యుపిఎస్ సి పరీక్షలు సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ర్వహిస్తున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనల ప్రకా రం పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సెప్టెంబరు 6 వ తేదీన జరగనున్న ఈ పరీక్షల కు నగరంలో 22 పరీక్షా కేంద్రాల లో 7,782 మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారన్న ఆయన ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహిణ జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని, కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలకు ఎగ్జామినేషన్ మెటీరియల్ రవాణా కు ఎస్కార్ట్ పెట్టాలని పోలీసుశాఖ ను కోరారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, కేంద్రాల వద్ద శానిటేషన్ మెరుగు పరచాలని, అభ్యర్థుల కు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, డిస్పోజబుల్ గ్లాసులు అందుబాటులో ఉంచాలని జివియంసీ అధికారులను కోరారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి సెప్టెంబర్ 5,6 తేదీలలో పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. పోస్ట్ ఎగ్జామినేషన్ మెటీరియల్ ను విమానం ద్వారా స్పీడ్ పోస్ట్ లో జాగ్రత్తగా పంపడానికి ఏర్పాట్లు చేసుకోవాలని తపాలా శాఖ అధికారులకు తెలిపారు. కేంద్రాల వద్ద అత్యవసర సేవలు అందించడానికి పారామెడికల్ సిబ్బంది ని అందుబాటులో ఉంచాలని జెసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.