వెలుగొండ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి..
Ens Balu
3
ఒంగోలు
2020-08-29 20:05:13
వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశిం చారు. శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హల్ లో వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యల పై ఇచ్చిన అర్జీలను పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ వెలుగొండ ప్రాజెక్ట్ భూ సేకరణ అధికారులు, రెవెన్యూ,పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణలో నష్టపోయిన ప్రజలకు సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. వెలి గొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఈ సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల ను పునరావాస కేంద్రాలకు తీసుకు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడము జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు గతంలో పొరపాటున అన్యాయం జరిగి ఉంటే వారికి సానుకూలంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపుగ్రామాల్లో ప్రజల నుండి3 వేల అర్జీలు వివిధ సమస్యల పై వచ్చాయ న్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపునకు గురైన 11 అవాసప్రాంతల్లో విచారణ చేపట్టడానికి 32 మంది తహశీల్దార్లు, ఎంపీడీఓ లను నియమించామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కొత్తగా సమస్యలపై ఇచ్చిన అర్జీలను కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు. సెప్టెంబర్ నాటికి ముంపు గ్రామాల్లో ఇక ప్రజల నుంచి అర్జీలు రాకూడ దన్నారు. సోమవారంనుంచి గురువారం లోగా ముంపు గ్రామాల్లో పర్యటించి అర్జీలపై విచారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. వి.మురళి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకo, వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కృష్ణవేణి, స్పెషల్ డిప్యూటీవ్ కలెక్టర్ చంద్రలీల,గ్లోరియా,మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషి రెడ్డి, తహశీల్దార్లు,ఎంపీడీఓ లు,తదితరులు పాల్గొన్నారు.