సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో భక్తులకు అత్యంత నాణ్యమైన అన్న ప్రసాదాలను అందించాలని ట్రస్టు బోర్డు ఛైర్మన్ సంచయిత గజపతి, సభ్యులు, ఈఓ ఎంవీ సూర్యకళ నిర్ణయించారు. ట్రస్టు బోర్డు సూచనల మేరకు అన్నదానం, ప్రసాదం తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో ఆధునీకరణ కోసం ఈఓ ఆసక్తి ఉన్నవారి నుంచి డిజైన్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఈఓ మీడియాతో మాట్లాడుతూ, దైవభక్తి ఉన్న ఔత్సాహిక డిజైన్లను ట్రస్టు బోర్డు పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి అన్న ప్రసాదాల కిచెన్ల ఆధునీకరణలో పాల్గొనవచ్చున్నన్నారు. ఎక్కువ మంది భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఆటోమేటిక్ మెకనైజ్డ్ , శానిటైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. దేవస్థానం ఇచ్చిన టెక్నికల్ క్రైటీరియా పాటిస్తూ సింహాచలం అన్నదానం , కిచెన్ల ఆధునీకరణ చేసేవారు డిజైన్లు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం దేవస్థానం వెబ్ సైట్ www.simhachalamdevasthanam.net లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ www.tender.apeprocurement.gov.in లను చూడవచ్చు. EOI (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇట్రస్టు) గురించి వివరాలు తెలుసుకోవడానికి దేవాలయం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవిరాజుకు 9618072527 ఫోన్ చేసి తెలుసుకోవచ్చనన్నారు.
దేవస్థానంలో ప్రస్తుతం ప్రతి రోజూ మ్యాన్యువల్ గా 15,000 పులిహోర ప్యాకెట్లు, 20,000 లడ్డూ ప్యాకెట్లను తయారు చేస్తోందని ఇకపై భక్తుల అవసరాలను దృష్టిలోపెట్టుకుని వీటి తయారీకి మెషీన్లు కూడా వినియోగించనున్నామన్నారు. రోజుకు దాదాపు 15,000 మందికి అన్నప్రసాదం అందించేలా అన్నప్రసాదం గ్రౌండ్ ఫ్లోర్ , సెంట్రల్ స్టోర్ కిచెన్ ను యాంత్రీకరించనున్నామని ఈఓ తెలిపారు. డిజైన్లు చేసిన వారికి ఎలాంటి పారితోషకం ఇవ్వరని, కేవలం స్వామివారిపై ఉన్న భక్తితోనే ఉచితంగానే డిజైన్లు సమర్పించాల్సి వుంటుందని పేర్కొన్నారు.