11.30 వరకే అప్పన్న ప్రసాద విక్రయాలు..
Ens Balu
2
Simhachalam
2021-05-31 15:49:38
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న దర్శనాల సమయం పెంచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. సోమవారం ఆమె ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనాలు జరుగుతున్న సమయం అంటే 11.30 వరకూ మాత్రమే ప్రసాదాల విక్రయాలు జరుగుతాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం రూ.300, 100, టోల్ గేట్ల టిక్కెట్లను ఒకే చోట అందించే ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో పెట్టుకొని క్యూలైన్య శానిటైజేషన్ చేయించినట్టు చెప్పారు. భక్తులంతా ఖచ్చితంగా మాస్కులు ధరించి ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈఓ తెలియజేశారు.