500 పడకల ఆసుపత్రి త్వరలోనే ప్రారంభం..
Ens Balu
3
Tadipatri
2021-05-31 15:52:46
తాడిపత్రి ప్రాంతంలోని ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రి వద్ద పూర్తి అయిన పనులను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ పరిశీలించారు. సోమవారం తాడిపత్రి వద్ద ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తి అయిన వని అతి త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని, ఎలక్ట్రిసిటీ, శ్యానిటేషన్ అప్రోచ్ రోడ్డు , ఫెన్సింగ్ మరియు ఆక్సిజన్ సప్లై పనులు అన్నీ పూర్తి అయినాయని, తాత్కాలిక బాత్ రూం ల యందు వాటర్ సప్లై , బాత్ రూం ఔట్ పుట్ నందు సంపులు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచాలని ఆదేశించారు. డాక్టర్లు మరియు నర్స్ లకు సంబంధించి రోజువారీ ఆహారము మరియు వారు నివాసం ఉంటున్న టేక్ ఇంజనీరింగ్ కాలేజీ నందు ప్రత్యేకంగా తనిఖీ చేసి, వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఇంఛార్జి అధికారులకు సూచించారు; కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి డిఈ చంద్రశేఖర్ రెడ్డి, తహశీల్దార్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.