సత్వర వైద్య సహాయమే ప్రభుత్వ లక్ష్యం..
Ens Balu
2
Anantapur
2021-05-31 15:54:32
కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు . ముఖ్యంగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య నిధుల నుంచి కూడా ఒక శాశ్వత ట్యాంకర్ ను జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. దీనివల్ల కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా ఆక్సిజన్ నిల్వలు పెంచుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో బయట ప్రాంతాల నుండి వచ్చే ఆక్సిజన్ పై ఆధారపడే వారమని ప్రస్తుతం ఆసుపత్రిలోనే స్వతహాగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకొని వాడుకునే విధంగా క్రయోజనిక్ ట్యాంకర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గత ఏడాది మార్చి నుండి ఒక సంవత్సర కాలంలో సుమారు 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ,కదిరి, గుంతకల్లు ఏరియా ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కరోనాబాధితులకు తాడిపత్రిలో 500 పడకలు, అనంతపురం సూపర్ స్పెషాలిటీ వద్ద 250 పడకలతో తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు చర్యలు తీసుకున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా ) నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్( గ్రామ , వార్డు సచివాలయం ) డా. ఏ. సిరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి ఎస్ ఎన్ మూర్తి , ఆర్ఎం ఓ డా.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.