అనంతలో శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్..


Ens Balu
3
Anantapur
2021-05-31 15:57:21

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో జిల్లాలో ఆక్సిజన్ నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టడంలో భాగంగా శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ ఏర్పాటు చేశామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి  అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని  కాపాడేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా జిల్లాలో నెలకొన్న లిక్విడ్ ఆక్సిజన్ కొరత తీర్చేందుకు 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసి ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రూ .24 లక్షల వ్యయంతో శాశ్వతంగా క్రయోజనిక్ ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎక్కడైనా ,ఏదైనా ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఇదివరకే జిల్లాకు వాహనం పైన అమర్చబడి ఉన్న క్రయోజనిక్ ట్యాంకర్ ను  తెప్పించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు డి ఆర్ డి ఓ సహకారాలతో జిల్లాలోఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్లు  మంజూరు అయ్యాయని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా ) నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్( గ్రామ , వార్డు సచివాలయం )  డా. ఏ. సిరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి ఎస్ ఎన్ మూర్తి , ఆర్ఎం ఓ డా.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు