అనాధలైన చిన్నారుల వివరాలు తెలియజేయండి..
Ens Balu
3
Visakhapatnam
2021-06-01 04:30:44
కరోనా వైరస్ భారినపడి తల్లిదండ్రులు మృతిచెంది అనాధలైన చిన్నారుల వివరాలు తెలియ జేయాలని విశాఖ అర్భన్ తహసీల్దార్ జ్నానవేణి కోరారు. మంగళవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణం తల్లిదండ్రులు మృుతి చెంది అనాధలైన చిన్నారులకు ప్రభుత్వం జీవో నెంబరు 243ని అనుసరించి రూ.పది లక్షలు ఎక్స్ గ్రేషియా మొత్తం బ్యాంకులో ఫిక్సిడ్ జిపాజిట్ చేస్తుందన్నారు. అలాంటి వారి సమాచారం తెలియజేయాలని వార్డు కార్పోరేటర్లను, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేశామన్నారు. అనాధలైన పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలన్నారు. అలాంటి వారి వివరాలను స్వయంగా తన నెంబరుకు 9849903824 తెలియజేయవచ్చునన్నారు. అనాధలైన చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని తహసీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.