ఖాళీ స్థలాల్లో చెత్తవేస్తే భారీ జరిమానా..


Ens Balu
2
Kurmannapalem
2021-06-01 11:51:06

మహావిశాఖ నగర పరిధిలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే భారీగా జరిమానా విధించాలని జివిఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ మేరకు నగరంలోని  జోన్ 6,  86వ వార్డు  కూర్మన్నపాలెం లోని ఉడా ( ఫేజ్ - 2) కాలనీల్లో ఆమె పర్యటించారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ, ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెత్త ఎక్కువగా ఉండడాన్ని గమనించి ఖాళీ స్థల యజమానులచే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించాలని సూచించారు.  మనమే శుభ్రం చేసి వారికి జరిమానా విధించాలని, ఇపిడిసిఎల్ సంస్థ చెట్లు కొమ్మలను తొలలాగించి ఆ ప్రదేశంలో వేసిన వారికి జరిమానా విధించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలలో చుట్టు ప్రక్కల నివసిస్తున్న వారు చెత్త వెస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మొత్తం ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటికి వి.ఎల్.టి. వేసారా లేదా అని                    ఆరా తీసారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని, చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.  రెసిడన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొలనీలోని లైట్లు, త్రాగునీరు మొదలైన సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్ళగా ఆ సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నరేంద్ర, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.  
సిఫార్సు