కరోనాలో దాతల సహాయం మరువలేనిది..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-06-01 11:57:50
కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న తరుణంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలకు చేసే సహాయం మరువలేనిదని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మంగళవారం విశాఖలోని యూత్ విత్ ఎ మిషన్ సంస్థ చేపట్టిన నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, సంస్థ డైరక్టర్ అనిల్ చోప్రా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న కుటుంబాలకు, పేద వారికి నిత్యవసర సరుకులు బియ్యం, పప్పు, నూనె, పసుపు, కారం లాంటి తదితర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా కూలి చేసుకొనే వారికి పనులు లేక చాలా ఇబ్బంది పడుచున్నారని ఆలాంటి వాళ్లకి మరెన్నో సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరక్టర్ తోపాటుపా 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.